'కేజీఎఫ్ 2' ప్రదర్శిస్తున్న థియేటర్లో తుపాకి కాల్పులు!
- థియేటర్ లో మూడు రౌండ్లు కాల్చిన ఆగంతుకుడు
- ఒక వ్యక్తి కాల్లోకి దూసుకెళ్లిన బుల్లెట్
- కర్ణాటకలోని శిగ్గావిలో చోటుచేసుకున్న ఘటన
ఊహించని ఈ ఘటనతో థియేటర్ లోని ప్రేక్షకులు బెంబేలెత్తిపోయారు. శిగ్గావిలోని రాజశ్రీ థియేటర్ లో నిన్న రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఆగంతుకుడు మొత్తం మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో వసంత్ కుమార్ అనే ఒక వ్యక్తి గాయపడ్డాడు. ఆయన కాల్లోకి బుల్లెట్ దిగింది. వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించారు. అయితే చీకట్లో ఆంగతుకుడు పరారయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.