Andhra Pradesh: మ‌మ్మ‌ల్ని విమ‌ర్శిస్తే మోదీని విమ‌ర్శించిన‌ట్టే... సోము వీర్రాజుకు కారుమూరి కౌంట‌ర్‌

apminister karumuri nageswara rao counter to somu veerraju
  • రేష‌న్‌కు బ‌దులు న‌గ‌దు ఇస్తామ‌న్న కారుమూరి
  • కారుమూరి వ్యాఖ్య‌ల‌పై విమ‌ర్శ‌లు గుప్పించిన సోము వీర్రాజు
  • రేష‌న్ బ‌దులు న‌గ‌దులో బ‌ల‌వంతం లేద‌న్న మంత్రి
ఏపీలో రేష‌న్ బియ్యం వ‌ద్ద‌నుకునే వారికి న‌గ‌దు ఇస్తామంటూ రాష్ట్ర పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వ‌ర‌రావు చేసిన ప్ర‌క‌ట‌న‌పై బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమ‌ర్శిస్తూ వ్యాఖ్య‌లు చేసిన సంగతి తెలిసిందే. వీర్రాజు విమ‌ర్శ‌ల‌పై తాజాగా కారుమూరి కౌంట‌ర్ ఇచ్చారు. త‌మ‌ను విమ‌ర్శిస్తే ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని విమ‌ర్శించిన‌ట్టేన‌ని మంత్రి ఈ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు.

కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ప‌థ‌కాన్నే తాము అమ‌లు చేస్తున్నామ‌ని చెప్పిన కారుమూరి.. రేష‌న్ బ‌దులు న‌గ‌దు ప‌థ‌కాన్ని ఏ ఒక్క‌రిపై బ‌ల‌వంతంగా రుద్ద‌డం లేద‌ని చెప్పారు. అయినా కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్న త‌మ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తే.. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని విమ‌ర్శించిన‌ట్టే అవుతుంద‌ని మంత్రి వ్యాఖ్యానించారు.
Andhra Pradesh
Somu Veerraju
Karunuri Nageswara Rao

More Telugu News