Yash: హిందీలో 250 కోట్ల వసూళ్లతో 'కేజీఎఫ్ 2'

KGF 2 Movie Update
  • ఈ నెల 14న విడుదలైన 'కేజీఎఫ్ 2'
  • బంగారు గనుల నేపథ్యంలో సాగే కథ 
  • రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్
  • కీలకమైన పాత్రలో రవీనా టాండన్
యష్ హీరోగా ప్రశాంత్ నీల్ 'కేజీఎఫ్ 2' సినిమాను రూపొందించాడు. విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా, విడుదలైన ప్రతి ప్రాంతంలో విజయవిహారం చేస్తోంది. హిందీలోను ఈ సినిమా ఒక రేంజ్ లో దూసుకుపోతోంది.

హిందీ వెర్షన్ లో ఈ సినిమా ఈ రోజుతో 250 కోట్ల మార్కును టచ్ చేసింది. చాలా వేగంగానే 300 కోట్ల మార్కును అందుకునే అవకాశాలు కూడా ఫుల్లుగా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. కథలో బలమైన యాక్షన్ తో పాటు ఎమోషన్ కలవడమే ఇందుకు కారణమని అంటున్నారు. 

యష్ యాక్షన్ ..  ప్రశాంత్ నీల్ టేకింగ్ ..  ఆసక్తిని రేకెత్తించే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ..భారీ తారాగణం ఈ సినిమా ఈ స్థాయిలో విజయాన్ని సాధించడానికి కారణమని అంటున్నారు. సంజయ్ దత్ ప్రతినాయకుడిగా నటించించిన ఈ సినిమాలో, శ్రీనిధి శెట్టి .. రవీనా టాండన్ .. ప్రకాశ్ రాజ్ .. రావు రమేశ్ .. ఈశ్వరీరావు ముఖ్యమైన పాత్రలను పోషించారు.
Yash
Srinidhi Shetty
Sanjay Dutt
KGF 2 Movie

More Telugu News