అమరరాజా సంస్థకు ఊరటనిచ్చిన ఏపీ హైకోర్టు

  • అమరరాజా సంస్థకు కరకంబాడిలో భూమి కేటాయింపు
  • అభివృద్ధి పనులు చేపట్టని సంస్థ
  • భూములు స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వ నిర్ణయం
  • అమరరాజా సంస్థకు నోటీసులు
  • హైకోర్టును ఆశ్రయించిన అమరరాజా యాజమాన్యం
AP High Court verdict favors to Amararaja Group

గల్లా కుటుంబానికి చెందిన అమరరాజా సంస్థకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. గతంలో అమరరాజా సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం తిరుపతి సమీపంలోని కరకంబాడిలో భూములను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రభుత్వం కేటాయించిన భూముల్లో అమరరాజా సంస్థ ఎలాంటి విస్తరణ పనులు చేపట్టనందున, ఆ భూములను స్వాధీనం చేసుకోవాలని ఆమధ్య రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 

దీనిపై కొంతకాలం కిందట రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అమరరాజా సంస్థకు నోటీసులు పంపారు. దీంతో అమరరాజా యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు.... ఆయా భూముల్లో యథాతథ స్థితిని కొనసాగించాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, అమరరాజా సంస్థపై ఎలాంటి వేధింపులకు పాల్పడరాదని అధికారులకు స్పష్టం చేసింది.

More Telugu News