చంద్ర‌బాబును సీఎం చేశాక రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటాను: జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి

19-04-2022 Tue 10:36
  • చంద్ర‌బాబు సీఎం అయితేనే ప్ర‌జ‌ల‌కు శాంతి, సంక్షేమ‌మ‌న్న‌ ప్ర‌భాక‌ర్ రెడ్డి
  • ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ఉద్య‌మిస్తే రౌడీషీట్లు తెరుస్తారా? అని ప్ర‌శ్న‌
  • ఈ తీరు స‌రికాద‌ని విమ‌ర్శ‌
jc prabhakar reddy slams ycp
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై టీడీపీ నేత జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి మండిప‌డ్డారు. అనంత‌పురంలో చంద్ర దండు రాష్ట్ర అధ్య‌క్షుడు ప్ర‌కాశ్ నాయుడిని క‌లిసిన‌ జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ.. చంద్ర‌బాబును సీఎం చేశాక రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటానని వ్యాఖ్యానించారు. చంద్ర‌బాబు నాయుడు సీఎం అయితేనే ప్ర‌జ‌ల‌కు శాంతి, సంక్షేమ పాల‌న అందుతాయని ఆయ‌న చెప్పారు. రాష్ట్రంలో నెల‌కొన్న‌ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ఉద్య‌మిస్తే రౌడీషీట్లు తెరుస్తున్నార‌ని, ఈ తీరు స‌రికాద‌ని విమ‌ర్శించారు.