auto driver: పోర్న్ మూవీలో నటించిందన్న అనుమానంతో.. భార్యను హతమార్చిన ఉన్మాది!

Bengaluru auto driver assumes wife acted in porn movie kills her in front of kids
  • బెంగళూరులో ఆటో డ్రైవర్ అఘాయిత్యం
  • రెండు నెలల క్రితం పోర్న్ వీడియో వీక్షణ
  • అందులో ఉన్నది తన భార్యేనన్న అనుమానం
  • కత్తితో దాడి చేయడంతో ఆమె మృతి
‘పోర్న్’ సినిమాలు చూడ్డానికి బానిసగా మారిన ఓ వ్యక్తి అనుమానంతో తన అర్థాంగినే బలి తీసుకున్నాడు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. ఆటో డ్రైవర్ గా పనిచేసే జహీర్ పాషా రెండు నెలల క్రితం మొబైల్ లో పోర్న్ చిత్రాన్ని చూశాడు. అందులో ఉన్న మహిళ తన భార్యేనన్న అనుమానం కలిగింది. అప్పటి నుంచి ఆమెను వేధించడం మొదలు పెట్టాడు.

వీరికి వివాహమై 15 ఏళ్లు కాగా, ఐదుగురు సంతానం కలిగారు. అందరూ కలిసే ఉంటున్నారు. రెండు నెలల క్రితం పోర్న్ వీడియోను చూసిన తర్వాత భార్యపై అనుమానంతో ఆమెను కొట్టాడు. 20 రోజుల క్రితం మరోసారి దాడి చేసి తీవ్రంగా కొట్టడంతో ఆమె ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. దీన్ని తట్టుకోలేకపోయిన బాధితురాలి తండ్రి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయబోగా ఆమె అడ్డుకుంది. 

తాజాగా గత ఆదివారం జషీర్ పాషా తన భార్యపై కత్తితో దాడి చేశాడు. అది చూసిన పాషా పెద్ద కుమారుడు తాత దగ్గరకు వెళ్లి చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. అయితే, వారు ఇంటికి వచ్చేసరికే ఆమె విగతజీవిగా పడి ఉంది.
auto driver
porn movie
killed
wife

More Telugu News