Bandi Sanjay: పాద‌యాత్ర‌లో బండి సంజ‌య్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి..ఫొటోలు విడుద‌ల చేసిన బీజేపీ నేత‌

attack on bjp telangana chief bandi sanjay yatra
  • దాడిలో ధ్వంస‌మైన కార్ల ఫొటోల‌ను షేర్ చేసిన సంజ‌య్‌
  • ఎంపీ అయిన త‌న‌కే భ‌ద్ర‌త లేద‌ని ఆవేద‌న‌
  • తాము అధికారంలోకి వ‌చ్చాక బుల్డోజ‌ర్‌ల‌తో స్వాగ‌తం ప‌లుకుతామ‌ని హెచ్చ‌రిక‌

ప్ర‌జా సంగ్రామ యాత్ర పేరిట బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ చేప‌ట్టిన పాద‌యాత్ర‌పై సోమ‌వారం నాడు రాళ్ల దాడి జ‌రిగింది. ఈ దాడిలో బండి సంజ‌య్ కాన్వాయ్‌లోని ప‌లు వాహ‌నాల అద్దాలు ధ్వంస‌మ‌య్యాయి. ఈ విష‌యాన్ని స్వ‌యంగా బండి సంజ‌యే వెల్ల‌డించారు. రాళ్ల దాడిలో త‌మ వాహ‌నాలు ఎలా ధ్వంస‌మ‌య్యాయ‌న్న విష‌యాన్ని తెలిపేందుకు ఆయ‌న ధ్వంస‌మైన వాహ‌నాల ఫొటోల‌ను కూడా షేర్ చేశారు.

ఈ సంద‌ర్భంగా త‌న కాన్వాయ్‌పై జ‌రిగిన రాళ్ల దాడి టీఆర్ఎస్ శ్రేణులు చేసిన దాడిగానే బండి సంజ‌య్ ప‌రిగ‌ణించారు. టీఆర్ఎస్ శ్రేణులే త‌న పాద‌యాత్ర‌పై దాడి చేశాయ‌ని ఆయ‌న ఆరోపించారు. ఈ దాడితో ఏకంగా ఎంపీ అయిన త‌న‌కే భ‌ద్ర‌త లేద‌ని టీఆర్ఎస్ శ్రేణులు చెప్పిన‌ట్టయిందని ఆయ‌న వ్యాఖ్యానించారు. త‌మ‌పై రాళ్ల దాడి చేసిన వారికి బీజేపీ ప్ర‌భుత్వం వ‌చ్చాక‌ బుల్డోజ‌ర్‌ల‌తో స్వాగ‌తం ప‌ల‌క‌నున్న‌ట్లుగా బండి సంజ‌య్ ఘాటు కౌంట‌ర్ ఇచ్చారు.

  • Loading...

More Telugu News