Narendra Modi: రేపు ఎర్రకోట వేదికగా జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ

PM Narendra Modi will address the nation from Red Fort tomorrow
షార్ట్స్‌లో చూడండి
సిక్కుల గురువు తేగ్ బహదూర్ జయంతిని పురస్కరించుకుని రేపు ఢిల్లీలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అంతేకాదు, గురు తేగ్ బహుదూర్ జ్ఞాపకార్థం ఓ పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేయనున్నారు. 

సాధారణంగా భారత ప్రధాని ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మాత్రమే ఎర్రకోట నుంచి ప్రసంగించడం ఆనవాయతీ. అయితే, గురు తేగ్ బహదూర్ జయంతిని పురస్కరించుకుని ఆయన ఎర్రకోట నుంచి ప్రసంగించాలని నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రులు, దేశవిదేశాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు.
Go Back to Shorts
Narendra Modi
Tegh Bahadur
Sikh
Red Fort
New Delhi
India

More Telugu News