Prabhudheva: వడివేలు, ప్రభుదేవా కలిస్తే నవ్వులు ఆగుతాయా..?.. వీడియో చూడండి

Prabhudheva shares a video of Vadivelu singing Sing in the rain
  • నాయ్ శేఖర్ రిటర్న్స్ షూటింగ్ సందర్భంగా భేటీ
  • సింగ్ ఇన్ ద రైన్ పాటను పాడిన వడివేలు
  • వీడియోను షేర్ చేసిన ప్రభుదేవా
ప్రభుదేవా, వడివేలు చాలా కాలం తర్వాత కలుసుకున్నారు. వీరిద్దరూ ఎప్పటి నుంచో మంచి స్నేహితులు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 1994లో వీరిద్దరూ కలిసి నటించిన 'ప్రేమికుడు' సినిమా (తమిళంలో కాదలన్) ఎంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందో తెలుసు. వడివేలు అనారోగ్యం, ఇతర కారణాలతో సినిమాలకు కొంతకాలంపాటు దూరమయ్యారు. మళ్లీ క్రమంగా నటనకు దగ్గరవుతున్నారు. ఆయన నటిస్తున్న 'నాయ్ శేఖర్ రిటర్న్స్' సినిమా షూటింగ్ సందర్భంగా వడివేలు, ప్రభుదేవా మళ్లీ ఇప్పుడు కలుసుకున్నారు.

‘సింగ్ ఇన్ ద రైన్’ అంటూ వడివేలు పాట పాడుతుంటే, పక్కనే ఉన్న ప్రభుదేవా నవ్వు ఆపుకోలేకపోయారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోను ప్రభుదేవా స్వయంగా షేర్ చేశారు. దానికి నాట్పు అనే క్యాప్షన్ తగిలించారు. అంటే స్నేహం అని అర్థం. రెండు దశాబ్దాల క్రితం నాటి వడివేలు కామెడీ హిట్ సినిమా 'మనదాయ్ తిరుదివిత్తాయ్'లోని మధుర క్షణాలను అభిమానులకు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ సినిమాలో మాదిరే వడివేలు పాటను ఆలపించారు.
Prabhudheva
Vadivelu
Met

More Telugu News