ipl: మైదానంలో ఆగ్ర‌హంతో క్యాప్ తీసి కింద విసిరేయ‌బోయిన జ‌డేజా.. వీడియో వైర‌ల్

IPL 2022 jadeja fires on dube
  • గ‌త రాత్రి గుజ‌రాత్ టైటాన్స్‌తో చెన్నై సూప‌ర్ కింగ్స్ మ్యాచ్ 
  • డ్వేన్ బ్రావో వేసిన బంతిని కొట్టిన‌ మిల్ల‌ర్ 
  • క్యాచ్ ప‌ట్ట‌కుండా వ‌దిలేసిన‌ శివం దుబే

ఐపీఎల్ లో భాగంగా గ‌త రాత్రి గుజ‌రాత్ టైటాన్స్‌తో చెన్నై సూప‌ర్ కింగ్స్ మ్యాచ్ ఆడిన విష‌యం తెలిసిందే. ఫీల్డింగ్ చేస్తోన్న స‌మ‌యంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ ర‌వీంద్ర జ‌డేజా తీవ్ర ఆగ్ర‌హానికి గురై క్యాప్ తీసేసి, మైదానంలో విసిరేయ‌బోయిన‌ వీడియో వైరల్ అవుతోంది. 

గుజ‌రాత్ బ్యాటింగ్ చేస్తోన్న స‌మ‌యంలో 17వ‌ ఓవ‌ర్‌లో డ్వేన్ బ్రావో వేసిన బంతిని డేవిడ్ మిల్ల‌ర్ భారీ షాట్ కొట్ట‌డానికి ప్ర‌య‌త్నించాడు. అయితే, అది డీప్ మిడ్ వికెట్‌లో ఫీల్డింగ్ చేస్తోన్న‌ శివందూబే వైపు బంతి వెళ్లగా, ఫ్లడ్‌లైట్‌ల కార‌ణంగా దూబే ఆ బంతిని ప‌ట్టే ప్ర‌య‌త్నం కూడా చేయ‌లేదు. ఆ బంతి దూబే ముందే ప‌డిన‌ప్ప‌టికీ క్యాచ్ ప‌ట్ట‌క‌పోవ‌డంతో జ‌డేజా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. అలాగే, బౌల‌ర్ బ్రావో కూడా అస‌హ‌నం ప్ర‌ద‌ర్శించాడు.

  • Loading...

More Telugu News