మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి నెల్లూరులో ఘనస్వాగతం
- ఏపీ వ్యవసాయమంత్రిగా కాకాణి గోవర్ధన్ రెడ్డి
- మంత్రి అయిన తర్వాత తొలిసారిగా నెల్లూరు రాక
- కావలి నుంచి నెల్లూరుకు బైక్ ర్యాలీ
- పూలవర్షం కురిపించిన కార్యకర్తలు
ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఆర్యవైశ్య నేతలు, వైసీపీ శ్రేణులు కాకాణికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాకాణి ఆత్మకూరు బస్టాండు వద్ద పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలదండలు వేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత నెల్లూరు వైసీపీ కార్యాలయానికి ఊరేగింపుగా తరలి వెళ్లారు.
అంతకుముందు, అమరావతి నుంచి కావలి విచ్చేసిన ఆయనకు పట్టణ శివార్లలో స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కార్యకర్తలు స్వాగతం పలికారు. పూలవర్షం కురిపిస్తూ కావలి పట్టణంలోకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కాకాణి... ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లారు. అనంతరం నెల్లూరు పయనమయ్యారు.