Andhra Pradesh: లేడీ క‌లెక్ట‌ర్ ఫొటోల‌తో న‌కిలీ మెసేజ్‌లు... ఎస్పీకి ఫిర్యాదు చేసిన అనంతపురం క‌లెక్ట‌ర్‌

  • అనంత‌పురం క‌లెక్ట‌ర్ నాగ‌లక్ష్మి ఫొటోల‌తో మెసేజ్‌లు
  • సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన సందేశాలు
  • వేగంగా స్పందించిన క‌లెక్ట‌ర్‌
  • నిందితుల‌ను శిక్షించాలంటూ ఎస్పీకి ఆదేశాలు
సోష‌ల్ మీడియా వేదిక‌గా న‌కిలీ ఫొటోలు, న‌కిలీ మెసేజ్‌లతో క‌ల‌క‌లం సృష్టిస్తున్న ఘ‌ట‌న‌లు పెరిగిపోతున్నాయి. తాజాగా ఏపీలోని అనంత‌పురం జిల్లా క‌లెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మి ఫొటోల‌ను వాడుకుని కొంద‌రు గుర్తు తెలియ‌ని వ్యక్తులు సోష‌ల్ మీడియా వేదిక‌గా న‌కిలీ మెసేజ్‌ల‌ను వైర‌ల్ చేస్తున్నారు. ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది.

అయితే ఈ వ్య‌వ‌హారంపై వేగంగా స్పందించిన అనంతపురం క‌లెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మి నేరుగా జిల్లా ఎస్పీ ఫ‌కీర‌ప్ప‌కు ఫిర్యాదు చేశారు. త‌న ఫొటోల‌ను వాడుకుని న‌కీలీ మెసేజ్‌లు పెడుతూ కొంద‌రు సోష‌ల్ మీడియాలో త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌న్న క‌లెక్ట‌ర్‌.. వారెవ‌రో గుర్తించి కఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు.
Andhra Pradesh
Anantapur District
Anantapur Collector
Anantapur SP
Social Media

More Telugu News