Kishan Reddy: రా రైస్ ఎంతిచ్చినా కొనండి... ఎఫ్‌సీఐ అధికారుల‌కు కిష‌న్ రెడ్డి ఆదేశం

kishan reddy meeting with fci officials
  • ఎఫ్‌సీఐ అధికారుల‌తో కిష‌న్ రెడ్డి భేటీ
  • తెలంగాణ ధాన్యం కొనుగోళ్ల‌పై చ‌ర్చ‌
  • అవ‌స‌ర‌మైతే పీయూష్ గోయ‌ల్‌తో మాట్లాడ‌తాన‌న్న కిష‌న్ రెడ్డి
తెలంగాణ ప్ర‌భుత్వం ఎంత మేర రా రైస్ ఇచ్చినా తీసుకోవాల‌ని భార‌త ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) అధికారుల‌కు కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేర‌కు శ‌నివారం సాయంత్రం ఎఫ్‌సీఐ అధికారుల‌తో ప్ర‌త్యేకంగా భేటీ అయిన సంద‌ర్భంగా కిష‌న్ రెడ్డి ఈ ఆదేశాలు జారీ చేశారు. అవ‌స‌ర‌మైతే.. తాను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో స్వ‌యంగా మాట్లాడ‌తాన‌ని కూడా ఎఫ్‌సీఐ అధికారుల‌కు కిష‌న్ రెడ్డి చెప్పారు. 

40.20 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వానికి లేఖ రాసిన సంగ‌తి తెలిసిందే. తెలంగాణ స‌ర్కారు చెప్పిన దాని కంటే కూడా ఎక్కువ రా రైస్ వ‌చ్చినా కొనాలంటూ కిష‌న్ రెడ్డి ఎఫ్‌సీఐ అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు.
Kishan Reddy
BJP
Telangana
FCI

More Telugu News