Andhra Pradesh: ఈ జాబ్ మేళా ద్వారా 25 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాం: విజయసాయిరెడ్డి

Will Provide employment for 25000 says Vijaya Sai Reddy
  • లాంఛనంగా జాబ్ మేళా ప్రారంభం
  • తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో మేళా
  • ఇవాళ, రేపు కొనసాగుతుందని వెల్లడి
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో వైసీపీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా ప్రారంభమైంది. పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి మేళాను లాంఛనంగా ప్రారంభించారు. ఇవాళ, రేపు రెండు రోజుల పాటు జాబ్ మేళా కొనసాగుతుందని చెప్పారు. 

రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన అన్నారు. మూడు ప్రాంతాల్లో దశలవారీగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని, వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ కన్ఫర్మేషన్ లెటర్ వచ్చిన వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దీని ద్వారా 25 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు.
Andhra Pradesh
Vijayasai Reddy
YSRCP
Job Mela

More Telugu News