Umran Malik: శ్రేయాస్ ను ఉమ్రాన్ క్లీన్ బౌల్డ్ చేయడంతో.. డేల్ స్టెన్ పట్టరాని ఆనందం

Dale Steyn Jumps Off His Seat After Umran Malik Cleans up Shreyas Iyer
  • 10వ ఓవర్లో ఉమ్రాన్ మాలిక్ అద్భుత బౌలింగ్
  • యార్కర్ సంధించడంతో అయ్యర్ అవుట్
  • డగౌట్ లో సంబరపడిపోయిన స్టెన్
తాను శిక్షణ ఇచ్చిన బౌలర్ మంచి ప్రదర్శన ఇస్తే ఏ కోచ్ కు అయినా పట్టరాని ఆనందం రావడంలో ఆశ్చర్యం లేదు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు బౌలింగ్ కోచ్ సేవలు అందిస్తున్న డేల్ స్టెన్ లోనూ ఇదే కనిపించింది. కోల్ కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ మధ్య శుక్రవారం రాత్రి ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ చక్కని విజయం సాధించడం తెలిసిందే.

కేకేఆర్ ఛేదనలో ఉన్న క్రమంలో ఆ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఉమ్రాన్ మాలిక్ సంధించిన యార్కర్ కు మూడు వికెట్లు ఎగిరిపోయి శ్రేయాస్ అయ్యర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. డగౌట్ లో కూర్చుని దీన్ని చూసిన డేల్ స్టెన్ వెంటనే సీటులో నుంచి లేచి ఆనందంతో ఊగిపోయాడు. ముత్తయ్య మురళీధరన్ దగ్గరకు వెళ్లి చేత్తో తట్టి సంతోషాన్ని పంచుకున్నాడు. కేకేఆర్ బ్యాటింగ్ చేస్తుండగా 10వ ఓవర్లో ఇది చోటు చేసుకుంది.
Umran Malik
Shreyas Iyer
Clean bould
IPL

More Telugu News