విష్వక్సేన్ పెద్ద సాహసమే చేస్తున్నాడే!

  • కొత్త కంటెంట్ తో వస్తున్న విష్వక్సేన్ 
  • గ్రామీణ నేపథ్యంలో సాగే కథ 
  • దర్శకుడిగా విద్యాసాగర్  పరిచయం 
  • ఈ నెల 22 నుంచి 30వ తేదీకి వాయిదా
Asokavanamlo Arjuna Kalyanam Movie

మొదటి నుంచి కూడా మాస్ కంటెంట్ ఎక్కువగా ఉన్న కథలను చేస్తూ విష్వక్సేన్ ముందుకు వెళుతున్నాడు. ఈ తరహా కథల్లో ప్రేక్షకుల నుంచి ఆయనకి మంచి ఆదరణ లభించింది. అయితే ఇక ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి కూడా మంచి మార్కులను కొట్టేయాలనే ఉద్దేశంతో ఆయన రూట్ మార్చాడు. ఆ ప్రయత్నంలో భాగంగా చేసిన సినిమానే 'అశోకవనంలో అర్జున కల్యాణం'.

బాపినీడు - సుధీర్ నిర్మించిన ఈ సినిమాకి విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహించాడు. ఇది గ్రామీణ నేపథ్యంలో రూపొందిన కథ. లవ్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టయినర్. ఈ సినిమాను ఈ నెల 22వ తేదీన విడుదల చేయవలసి ఉంది. కానీ తాజాగా ఈ నెల 30వ తేదీకి వాయిదా వేశారు. 

నిజానికి ఈ నెల 22వ తేదీ విడుదలకి మంచి సమయమే. అప్పటికి తెలుగు రాష్ట్రాల్లో 'కేజీఎఫ్ 2' ఉద్ధృతి తగ్గుతుంది. అలా కాకుండా ఈ సినిమాను తీసుకెళ్లి 30వ తేదీలో వేశారు. అంతకుముందు రోజే 'ఆచార్య' విడుదలవుతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అలాంటి సినిమా తరువాత రోజునే బరిలోకి దిగడమంటే అది విష్వక్ సేన్ చేస్తున్న సాహసమే అవుతుంది.

More Telugu News