Anand Mahindra: అందరినీ ఆలోచింపజేస్తున్న ఆనంద్ మహీంద్రా ట్వీట్

  • 'మీ ఎయిర్ బ్యాగ్ ఇక్కడ టెస్ట్ చేసుకోండి'
  • హెవీ లారీ వెనుక వినూత్నమైన కొటేషన్
  • మహీంద్రా ట్వీట్ కు నెటిజన్ల భిన్న స్పందన  
Anand Mahindra Thinks This Message On Back Of A Truck Is Brilliant

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సరికొత్త ట్వీట్ తో అభిమానుల ముందుకు వచ్చారు. ఈ విడత వాహనదారులను ఆలోచింపజేసే ఒక కొటేషన్ ను ఆయన అందరితో పంచుకున్నారు. ‘నన్ను చూసి ఏడవకు రా’, ‘నీ ఏడుపే నా గెలుపు’, ‘నిదానమే ప్రధానం’ ఇలాంటి కొటేషన్లు నాలుగు చక్రాలు, అంతకంటే పెద్ద వాహనాల వెనుక భాగంలో రాసి ఉండడాన్ని గమనించే ఉంటారు. ఈ తరహా ఒక వినూత్నమైన కొటేషన్ ఆనంద్ మహీంద్రా కంట్లో పడింది. దానిని ట్విట్టర్ లో షేర్ చేశారు. 

ఒక హెవీ ట్రక్ లోడ్ లారీ వెనుక భాగంలో ‘టెస్ట్ యువర్ ఎయిర్ బ్యాగ్ హియర్’ అని రాసి ఉంది. ఈ ఫొటోనే ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేసి, బ్రిలియంట్ (తెలివైన) అని కామెంట్ పెట్టారు. దీనికి నెటిజన్లు బాగానే స్పందిస్తున్నారు. ఎంతో సానుకూల దృక్పథం అంటూ ఒక యూజర్ స్పందించాడు. అలాంటి కొటేషన్లు మరికొన్నింటిని యూజర్లు షేర్ చేశారు. కానీ, ఒక యూజర్ మాత్రం భిన్నంగా స్పందించాడు.

‘‘డియర్ ఆనంద్ మహీంద్రా, భద్రతకు సంబంధించి మీరు మార్గదర్శి. మహీంద్రా వాహనాలు ప్రపంచంలోనే సురక్షితమైనవి. బ్రిలియంట్ అని మీరు చెప్పకూడదని భావిస్తున్నాను. దీనికి ముందు డోంట్ అని చెబితే బావుంటుంది. డోంట్ టెస్ట్ యువర్ ఎయిర్ బ్యాగ్ హియర్’’ అంటూ లల్లీ సంఘ అనే యూజర్ రిప్లయ్ ఇచ్చాడు. వాహనదారుల భద్రత కోసం కార్లలో ఎయిర్ బ్యాగులు తప్పనిసరి అనే నిబంధన తీసుకురావడం తెలిసిందే. ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలను ఎయిర్ బ్యాగులు కాపాడతాయి. దీన్ని ఆలోచింపజేయడమే ఈ కొటేషన్ ఉద్దేశ్యమని తెలుస్తోంది.

More Telugu News