Patrick Farhart: ఐపీఎల్ లో కరోనా కలకలం... ఢిల్లీ క్యాపిటల్స్ ఫిజియోకు పాజిటివ్

Delhi Capitals physio Patrick Farhart tested corona positive
  • కరోనా దెబ్బకు అర్థాంతరంగా నిలిచిన గత సీజన్
  • మిగిలిన మ్యాచ్ లు యూఏఈలో నిర్వహణ
  • ఈసారి కఠినమైన బయోబబుల్
  • అయినప్పటికీ ఢిల్లీ ఫిజియో ప్యాట్రిక్ ఫర్హార్ట్ కు పాజిటివ్
గత ఐపీఎల్ సీజన్ లో కరోనా ఎలాంటి దుమారం రేపిందో తెలిసిందే. పలు జట్లలోని ఆటగాళ్లు, సహాయక సిబ్బంది కరోనా బారినపడడంతో ఆ సీజన్ అర్థాంతరంగా ఆగిపోయింది. దాంతో మిగిలిన మ్యాచ్ లను యూఏఈలో నిర్వహించి, టోర్నీ పూర్తి చేశారు. తాజా సీజన్ లోనూ కరోనా కలకలం రేగింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఫిజియో ప్యాట్రిక్ ఫర్హార్ట్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో అతడిని ఐసోలేషన్ కి తరలించారు. అతడి ఆరోగ్య పరిస్థితిని ఢిల్లీ క్యాపిటల్స్ వైద్యబృందం నిశితంగా పర్యవేక్షిస్తున్నట్టు ఈ మేరకు ఐపీఎల్ నిర్వాహకులు ఓ ప్రకటన చేశారు.
Patrick Farhart
Corona Virus
Positive
Physio
Delhi Capitals
IPL

More Telugu News