గుజరాత్ టైటాన్స్ పై టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్

Rajasthan Royals won the toss
  • ముంబయి డీవై పాటిల్ స్టేడియంలో మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్
  • చెరో మూడు విజయాలతో సమ ఉజ్జీలుగా ఉన్న జట్లు
ఐపీఎల్ తాజా సీజన్ లో మరో ఆసక్తికరమైన పోరు జరగనుంది. నేడు ముంబయి డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ మైదానంలో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఈ పోరులో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. టోర్నీలో ఇప్పటివరకు రెండు జట్లు చెరో 4 మ్యాచ్ లు ఆడి, 3 విజయాలు సాధించాయి. మెరుగైన రన్ రేట్ తో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇవాళ్టి మ్యాచ్ లో గుజరాత్ గెలిస్తే అత్యధిక విజయాలతో పాయింట్ల పట్టికలో ప్రథమస్థానానికి ఎగబాకుతుంది. 

ఈ మ్యాచ్ కోసం రాజస్థాన్ జట్టులో ట్రెంట్ బౌల్ట్ స్థానంలో జిమ్మీ నీషామ్ ను తీసుకున్నారు. బౌల్ట్ స్వల్పగాయంతో బాధపడుతున్నాడు. అటు గుజరాత్ జట్టులో రెండు మార్పులు చేశారు. దర్శన్ నల్కండే స్థానంలో యశ్ దయాళ్... సాయి సుదర్శన్ స్థానంలో విజయ్ శంకర్ ఆడుతున్నారు.
Go Back to Shorts
Rajasthan Royals
Toss
Gujrat Titans
IPL

More Telugu News