Pub: పబ్ పై దాడికి ముందు 13 కాల్స్‌... డ్ర‌గ్స్ గురించే మాట్లాడుకున్న అనిల్‌, అభిషేక్‌

  • ఫుడింగ్ అండ్ మింక్ ప‌బ్ కేసులో మ‌రిన్ని కీల‌క వివ‌రాల వెల్ల‌డి
  • ప‌బ్ ఓన‌ర్ అభిషేక్‌, మేనేజ‌ర్ అనిల్ ల మ‌ధ్య ఫోన్ కాల్స్‌
  • కొకైన్ డ్ర‌గ్ గురించే చ‌ర్చించుకున్న ఇద్ద‌రు నిందితులు
  • పోలీసుల క‌స్ట‌డీ విచార‌ణ‌లో వెల్ల‌డైన ఫోన్ కాల్స్‌
some more details revealed in drugs case

ఫుడింగ్ అండ్ మింక్ ప‌బ్ కేసులో మరిన్ని కీల‌క విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. లేట్ నైట్ పార్టీ జ‌రిగిన ఈ ప‌బ్‌లో డ్ర‌గ్స్ వాడిన‌ట్లు ఇప్ప‌టికే పోలీసులు నిర్ధారించిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో ప‌బ్ ఓన‌ర్ అభిషేక్‌, మేనేజ‌ర్ అనిల్‌లు అరెస్టవగా, కోర్టు అనుమ‌తితో వారిద్ద‌రినీ గురువారం పోలీసులు త‌మ క‌స్ట‌డీలోకి తీసుకుని విచారించారు.

ఈ విచార‌ణ సంద‌ర్భంగా వారిద్ద‌రి మ‌ధ్య చోటుచేసుకున్న ప‌లు ఫోన్ కాల్స్ బ‌య‌ట‌ప‌డ్డాయి. ప‌బ్‌పై పోలీసులు దాడి చేయ‌డానికి ముందు వారిద్ద‌రి మ‌ధ్యా 13 ఫోన్ కాల్స్ న‌డిచాయి. ఈ కాల్స్‌లో వారిద్ద‌రూ డ్ర‌గ్స్ గురించే మాట్లాడుకున్న‌ట్లుగా తేలింది. అది కూడా కొకైన్ డ్ర‌గ్ గురించే వారు ఈ ఫోన్ కాల్స్ లో చ‌ర్చించుకున్నట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ నేప‌థ్యంలో వీరిద్ద‌రిపై మ‌రిన్ని సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేసే అవ‌కాశాలున్నాయి.

More Telugu News