RRR: 30కి పైగా దేశాల్లో విడుదలకానున్న 'ఆర్ఆర్ఆర్'... జపాన్ లో ఎప్పుడు విడుదల కాబోతోందంటే..!

RRR to release in 30 more countries
షార్ట్స్‌లో చూడండి
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన 'ఆర్ఆర్ఆర్' చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి విదితమే. బాక్సాఫీస్ ను ఈ చిత్రం కొల్లగొడుతోంది. ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 570 కోట్లకు పైగా షేర్, రూ. 1,045 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని రామ్ చరణ్ తెలిపారు. 

ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా మరో 30 దేశాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు చెప్పారు. అక్టోబర్ లో ఈ సినిమా జపాన్ లో విడుదల అవుతుందని తెలిపారు. జపాన్ ప్రమోషన్స్ కోసం తాను, తారక్, చిత్ర యూనిట్ రెండు రోజుల పాటు ఆ దేశంలో పర్యటిస్తామని చెప్పారు. చైనాలో కూడా ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉందని అన్నారు.
Go Back to Shorts
RRR
Japan
China
Ramcharan

More Telugu News