Akbaruddin Owaisi: ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ కేసుల్లో నేడు తుదితీర్పు.. పాతబస్తీలో కట్టుదిట్టమైన బందోబస్తు

Nampally court to announce final verdict on MIM MLA Akbaruddin Owaisi
  • 9 ఏళ్ల క్రితం నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో రెచ్చగొట్టేలా ప్రసంగం
  • 30 మంది సాక్షులను విచారించిన కోర్టు
  • ఆ గొంతు అక్బరుద్దీన్‌దేనని నిర్ధారించిన ఫోరెన్సిక్ ల్యాబ్
  • తీర్పు సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల అప్రమత్తం
మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారంటూ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీపై నమోదైన కేసుల్లో నేడు తుది తీర్పు వెల్లడి కానుంది. 9 సంవత్సరాల క్రితం నిర్మల్, నిజామాబాద్ జిల్లాలలో అక్బరుద్దీన్ మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారంటూ కేసులు నమోదయ్యాయి. వీటికి సంబంధించి నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల కోర్టులో విచారణ ముగిసింది. 

ఇందులో భాగంగా 30 మందికిపైగా సాక్షులను కోర్టు విచారించింది. అలాగే, ఆ ప్రసంగంలోని గొంతు అక్బరుద్దీన్‌దేనని ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా ఇప్పటికే నిర్ధారించింది. విచారణ ముగిసిన నేపథ్యంలో కోర్టు నేడు తుది తీర్పు వెలవరించనుంది. తీర్పు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పాతబస్తీలో అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Akbaruddin Owaisi
Nirmal District
Nizamabad District
Namplly Court
Hyderabad
MIM
Hate Speach

More Telugu News