ఏపీ మొత్తమ్మీద విశాఖలో రెండు కరోనా కేసులు

Two corona positive cases recorded in Visakha districts
  • గత 24 గంటల్లో 3,509 కరోనా పరీక్షలు
  •  కరోనా మరణాలు నిల్ 
  • కరోనా నుంచి కోలుకున్న నలుగురు
  • ఇంకా 41 మందికి చికిత్స
ఏపీలో కరోనా రోజువారీ కేసుల సంఖ్య వేళ్ల మీద లెక్కించే స్థాయికి పడిపోయింది. గడచిన 24 గంటల్లో 3,509 కరోనా పరీక్షలు నిర్వహించగా, ఇద్దరికి పాజిటివ్ గా తేలింది. ఆ రెండు కేసులు విశాఖ జిల్లాలో నమోదయ్యాయి. అదే సమయంలో నలుగురు కరోనా నుంచి కోలుకున్నారు. వరుసగా మరో రోజు కూడా కరోనా మరణాలేవీ సంభవించలేదు. 

ఏపీలో ఇప్పటివరకు 23,19,616 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 23,04,845 మంది ఆరోగ్యవంతులయ్యారు. కేవలం 41 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 14,730 మంది కరోనాతో మృతి చెందారు. 
.
Go Back to Shorts
Corona Virus
Positive Cases
Visakhapatnam District
Andhra Pradesh

More Telugu News