ముగిసిన దేవ్ గఢ్ రోప్ వే ప్రమాద ఘటన రెస్క్యూ ఆపరేషన్
- త్రికూట పర్వతాల వద్ద ప్రమాదం
- ఢీకొన్న కేబుల్ కార్లు
- గాల్లోనే 45 గంటల పాటు చిక్కుకుపోయిన ప్రజలు
- హెలికాప్టర్ల సాయంతో సహాయక చర్యలు
కాగా, అధికారులు వాయుసేన సాయం చేపట్టిన సహాయక చర్యలు ముగిశాయి. రెండు ఎంఐ-17 హెలికాప్టర్లు ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పాలుపంచుకున్నాయి. 45 మందిని కాపాడగా, ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఈ ప్రమాద ఘటనను ఝార్ఖండ్ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ప్రమాదం జరిగిన తీరుపై విచారణకు ఆదేశించింది. ఈ నెల 26న వాదనలు వింటామని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.