Naga Chaitanya: నాగచైతన్య కారు అద్దాలకు బ్లాక్ ఫిలిం... జరిమానా విధించిన పోలీసులు

  • బ్లాక్ ఫిలిం వాడకంపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు
  • వై కేటగిరీ భద్రత ఉన్నవారికే మినహాయింపు
  • కార్లకు బ్లాక్ ఫిలిం తొలగిస్తున్న ట్రాఫిక్ పోలీసులు
  • ఇటీవల పలువురు సినీ ప్రముఖులకు జరిమానా
Traffic Police imposed fine to Naga Chaitanya

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిబంధనలను పక్కాగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వై కేటగిరీ భద్రత ఉన్న వ్యక్తులు తప్ప మరెవ్వరూ వాహనాలకు బ్లాక్ ఫిలిం ఉపయోగించరాదని సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు గత కొన్నిరోజులుగా అద్దాలకు బ్లాక్ ఫిలిం ఉన్న కార్లను ఆపి, జరిమానాలు వడ్డిస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ విధంగా జరిమానాకు గురయ్యారు.

తాజాగా, యువ హీరో అక్కినేని నాగచైతన్య కారును కూడా జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు ఆపారు. కారు అద్దాలకు బ్లాక్ ఫిలిం ఉండడంతో రూ.700 జరిమానా విధించారు. ట్రాఫిక్ పోలీసులు చలాన్ రాసిన సమయంలో హీరో నాగచైతన్య కారులోనే ఉన్నట్టు సమాచారం.

More Telugu News