Balineni Srinivasa Reddy: జగన్ కార్యాలయానికి చేరుకున్న బాలినేని

Balineni reaches Jagan office
  • మంత్రి పదవి దక్కకపోవడంపై బాలినేని అలక
  • ఫలించిన సజ్జల చర్చలు
  • తలశిల, అప్పిరెడ్డిలతో కలిసి సీఎం కార్యాలయానికి చేరుకున్న బాలినేని

తనకు మంత్రి వర్గంలో స్థానం దక్కకపోవడంతో మనస్తాపానికి గురైన బాలినేని శ్రీనివాసరెడ్డి మెట్టుదిగారు. ఆయనతో సీఎం సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి జరిపిన చర్చలు ఫలించాయి. విజయవాడలోని తన నివాసం నుంచి జగన్ క్యాంపు కార్యాలయానికి తలశిల రఘురామ్, అప్పిరెడ్డిలతో కలిసి ఆయన వెళ్లారు. కాసేపటి క్రితమే వీరు జగన్ కార్యాలయానికి చేరుకున్నారు. బాలినేనితో జగన్ స్వయంగా మాట్లాడనున్నారు. మరోవైపు కాసేపటి క్రితమే మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలు కూడా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News