Atchannaidu: బీసీ కార్పొరేషన్లను జగన్ అణచివేశారు: అచ్చెన్నాయుడు

Atchannaidu fires on Jagan
  • బలహీనవర్గాలంటే వైయస్ కుటుంబానికి కోపమన్న అచ్చెన్న 
  • బీసీ ఫెడరేషన్లకు గతంలో వైయస్ ఒక్క పైసా ఇవ్వలేదని వ్యాఖ్య 
  • మూడేళ్లలో బీసీలకు జగన్ ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ 
వైయస్ కుటుంబానికి బలహీనవర్గాలంటే ముందు నుంచి కోపముందని టీడీపీ నేత అచ్చెన్నాయుడు అన్నారు. ఇప్పుడు సీఎం జగన్ కూడా బలహీనవర్గాలను ఉక్కుపాదంతో అణచి వేస్తున్నారని మండిపడ్డారు. బీసీ నేతలతో టీడీపీ కార్యాలయంలో ఆయన సదస్సు నిర్వహించారు. 

ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, బలహీనవర్గాలకు కేటాయించిన నిధులను పక్కదారి పట్టించిన ఘనత జగన్ దని అన్నారు. గతంలో బీసీ ఫెడరేషన్లు పెట్టి వైయస్ పైసా నిధులు కూడా ఇవ్వలేదని... ఇప్పుడు జగన్ బీసీ కార్పొరేషన్లు పెట్టి, వాటి నిధులను కూడా లాక్కొని మోసం చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసి ముగ్గురికి పంచారని... ఈ మూడేళ్లలో బీసీలకు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Atchannaidu
Telugudesam
Jagan
YSRCP

More Telugu News