Roja: రోజా మంత్రి అవుతున్న తరుణంలో ఆమె భర్త, కూతురు భావోద్వేగం!

Roja husband Selvamani and daughter Anshu gets emotional
  • రోజాకు జగన్ న్యాయం చేశారన్న భర్త సెల్వమణి
  • అమ్మ చాలా హార్డ్ వర్క్ చేశారన్న కూతురు అన్షు
  • అమ్మ ఫైర్ బ్రాండ్ గానే ఉంటారని వ్యాఖ్య
వైసీపీ ఎమ్మెల్యే, సినీ నటి రోజా మంత్రిగా బాధ్యతలను చేపడుతున్న నేపథ్యంలో ఆమె కుటుంబసభ్యులు అంతులేని ఆనందానికి గురవుతున్నారు. మీడియాతో మాట్లాడుతూ తమ భావోద్వేగాన్ని పంచుకున్నారు. రోజా భర్త, సినీ దర్శకుడు ఆర్కే సెల్వమణి మాట్లాడుతూ, చాలా సంతోషంగా ఉందని చెప్పారు. రోజాకు ముఖ్యమంత్రి జగన్ న్యాయం చేశారని... ఆయన ఇచ్చిన పదవికి రోజా కూడా న్యాయం చేస్తారని తెలిపారు.  

రోజా కూతురు అన్షు మాట్లాడుతూ, అమ్మ చాలా హార్డ్ వర్క్ చేశారని చెప్పారు. మంత్రి పదవి వచ్చినందుకు అమ్మ చాలా సంతోషంగా ఉందని, సీఎం జగన్ గారికి థ్యాంక్స్ చెపుతున్నామని అన్నారు. మంత్రి అయిన తర్వాత కూడా అమ్మ ఫైర్ బ్రాండ్ గానే ఉంటారని తాను భావిస్తున్నట్టు చెప్పారు.
Roja
YSRCP
Husband
Selvamani
Daughter
Anshu

More Telugu News