Junior NTR: ఎన్టీఆర్ జోడీగా దీపిక పదుకొణే!

Ntr and Prashanth Neel Combo Update
  • బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా దీపిక పదుకొణే  
  • ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్
  • 'ప్రాజెక్టు K'తో టాలీవుడ్ కి పరిచయం 
  • ప్రశాంత్ నీల్ కి కూడా గ్రీన్ సిగ్నల్     
బాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకొనే కథానాయిక దీపిక పదుకొణే. ప్రపంచవ్యాప్తంగా ఆమెకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆమె డేట్లు దొరికితే చాలు అనే పరిస్థితుల్లో అక్కడి దర్శక నిర్మాతలు ఉంటారు. ఇతర భాషల్లోని హీరోలు .. హీరోయిన్లు సైతం ఆమె అభిమానులుగా చెప్పుకుంటూ ఉండటం విశేషం.   

అలాంటి దీపిక తొలి సారిగా ఓ తెలుగు సినిమా చేయడానికి అంగీకరించింది. ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ' ప్రాజెక్టు K' సినిమాలో ఆమె నాయికగా నటిస్తోంది. ఆల్రెడీ ఈ సినిమా షూటింగు దశలో ఉంది. ఆ తరువాత ఆమె ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. 

' కేజీఎఫ్ 2'ను విడుదలకు రెడీ చేసిన ప్రశాంత్ నీల్, ఆ తరువాత 'సలార్' సినిమాను పూర్తిచేయనున్నాడు. ఈ నెల 14న  'కేజీఎఫ్ 2' రిలీజ్ కాగానే ఆయన 'సలార్' పనిలోనే ఉంటాడు. ఈ సినిమా తరువాత ఆయన ఎన్టీఆర్ తో ఒక సినిమాను ప్లాన్ చేశాడు. ఈ సినిమాలో నాయిక పాత్ర కోసం దీపికను ఒప్పించినట్టుగా చెబుతున్నారు. అక్టోబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని సమాచారం.
Junior NTR
Deepika Padukone
Prashanth Neel

More Telugu News