Mayawati: సొంత ఇంటిని చక్కదిద్దుకోలేక మా మీద విమర్శలా?: రాహుల్ గాంధీకి మాయావతి కౌంటర్

  • ఇటీవల యూపీలో అసెంబ్లీ ఎన్నికలు
  • విపక్షాలను చావుదెబ్బకొట్టిన అధికార బీజేపీ
  • మాయవతిపై విమర్శలు చేసిన రాహుల్ గాంధీ
  • దీటుగా బదులిచ్చిన బీఎస్పీ అధినేత్రి
Mayawathi reacts to Rahul Gandhi criticism

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేతిలో విపక్షాలు మట్టికరిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీఎస్పీ అధినేత్రి మాయావతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీ ఎన్నికల్లో కూటమిగా ఏర్పడదామని భావించామని, సీఎం అభ్యర్థిగా మాయవతి పేరును ప్రతిపాదించామని, కానీ ఆమె స్పందించలేదని అన్నారు. బహుశా ఈడీ, సీబీఐ, పెగాసస్ వంటి అంశాలతో వెనుకంజ వేసి ఉంటుందని వ్యాఖ్యానించారు. 

రాహుల్ వ్యాఖ్యలపై మాయావతి స్పందించారు. సొంత ఇంటిని చక్కదిద్దుకోలేక బీఎస్పీపై విమర్శలు చేస్తున్నారు అంటూ రాహుల్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. రాహుల్ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజంలేదని మాయవతి స్పష్టం చేశారు. ఇలాంటి చిన్న విషయాల కంటే యూపీలో ఓటమిపై దృష్టి పెడితే బాగుంటుందని హితవు పలికారు. 

"ఇలాంటి వ్యాఖ్యలు చేసేముందు కాంగ్రెస్ పార్టీ ఒకటికి 100 సార్లు ఆలోచించుకోవాలి. బీజేపీ నుంచి అధికారం చేజిక్కించుకోలేక, ఇలా రాళ్లు విసురుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిందేమీలేదు, అధికారంలో లేనప్పుడు చేసిందేమీ లేదు" అంటూ మాయావతి విమర్శలు గుప్పించారు.

More Telugu News