Sajjala Ramakrishna Reddy: విజయవాడలో బాలినేని నివాసానికి వచ్చిన సజ్జల... బుజ్జగించేందుకేనా...?

Sajjala goes to Balineni residence in Vijayawada

  • ఏపీలో కొత్త క్యాబినెట్
  • కసరత్తులు పూర్తి చేసిన సీఎం జగన్, సజ్జల
  • రేపు మంత్రివర్గ ప్రమాణస్వీకారం
  • మంత్రివర్గ విస్తరణ అంశాలపై బాలినేనితో సజ్జల భేటీ

ఏపీ కొత్త క్యాబినెట్ కూర్పు పూర్తయిన నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సీఎం జగన్ తో కొత్త క్యాబినెట్ కూర్పుపై కసరత్తులు ముగిసిన అనంతరం, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి... విజయవాడ బందరు రోడ్డులోని బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసానికి తరలి వెళ్లారు. మంత్రివర్గ విస్తరణ అంశాలపై బాలినేనితో చర్చించారు. బాలినేని ఇంటికి సజ్జల ఎందుకు వచ్చారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

బాలినేని ఇప్పటిదాకా విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. విద్యుత్ రంగ సంక్షోభం నేపథ్యంలో ఆయనపై విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలో బాలినేనికి కొత్త క్యాబినెట్ లో చోటు దొరుకుతుందా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు, సజ్జల విజయవాడలో బాలినేని ఇంటికి వెళ్లడం బుజ్జగించే ప్రయత్నంలో భాగమేనని ప్రచారం జరుగుతోంది.

  • Loading...

More Telugu News