Pawan Kalyan: 'హరిహర వీరమల్లు' సెట్ పై శ్రీరామనవమి పూజ చేసిన పవన్ కల్యాణ్... ఫొటోలు ఇవిగో!

Pawan Kalyan performs Sri Rama Navami Pooja at Harihara Veeramallu sets
  • క్రిష్ దర్శకత్వంలో పవన్ హీరోగా 'హరిహర వీరమల్లు'
  • హైదరాబాదులో షూటింగ్
  • పవన్ పై పోరాట సన్నివేశాల చిత్రీకరణ
  • నేడు శ్రీరామనవమి
  • షూటింగ్ కు ముందు పూజా కార్యక్రమాలు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో వస్తున్న 'హరిహర వీరమల్లు' చిత్రం జోరుగా షూటింగ్ జరుపుకుంటోంది. గత కొన్నిరోజులుగా హైదరాబాదులో పవన్ కల్యాణ్ పై కీలక పోరాట సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ టోడోర్ లాజరోవ్ పర్యవేక్షణలో ఈ ఫైట్ సీక్వెన్స్ లు చిత్రీకరిస్తున్నారు. 

కాగా, ఇవాళ శ్రీరామ నవమి పర్వదినం కావడంతో పవన్ కల్యాణ్ సెట్స్ పైనే పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వీరమల్లు గెటప్ లో ఉన్న ఆయన సెట్స్ పై ఏర్పాటు చేసిన రాములవారి చిత్ర పటానికి పూజలు చేశారు. అనంతరం షూటింగ్ కొనసాగించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి.
.
Pawan Kalyan
Sri Rama Navami
Pooja
Harihara Veeramallu
Tollywood

More Telugu News