రోడ్డు ప్రమాదానికి గురైన వారిని తన కారులో ఆసుపత్రికి తరలించిన భూమా అఖిలప్రియ

  • కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం
  • రోడ్డు పక్కన గుంతలోకి దూసుకెళ్లిన కారు
  • ముగ్గురికి గాయాలు
  • మానవతా దృక్పథంతో స్పందించిన అఖిలప్రియ 
Bhuma Akhila Priya humanitarian gesture gets accolades

టీడీపీ మహిళా నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మానవతాదృక్పథం ప్రదర్శించారు. కర్నూలు జిల్లా సిరివెళ్ల మండలం వెంకటాపురం వద్ద ఓ కారు ప్రమాదానికి గురైంది. రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. 

ఆ సమయంలో అటుగా వెళుతున్న భూమా అఖిలప్రియ ప్రమాదం గురించి తెలుసుకుని తన వాహనం ఆపారు. గాయపడిన వారి పరిస్థితి పట్ల చలించిపోయిన ఆమె, వారిని వెంటనే తన కారులో ఎక్కించి నంద్యాలలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం క్షతగాత్రులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిని సకాలంలో ఆసుపత్రికి తరలించిన భూమా అఖిలప్రియను స్థానికులు అభినందిస్తున్నారు.

More Telugu News