Nellore District: పిన్నెల్లికి మంత్రి పదవి ఇవ్వకపోతే రాజీనామా చేస్తామంటోన్న పలువురు ప్రజాప్రతినిధులు
వైసీపీలో మొదటినుంచీ ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందేనంటూ పలువురు ప్రజాప్రతినిధులు, పిన్నెల్లి అనుచరులు ఏపీ సీఎం జగన్ను డిమాండ్ చేస్తున్నారు. పల్నాడు జిల్లా మాచర్లలోని ఎంపీడీవో కార్యాలయంలో స్థానిక ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. పిన్నెల్లికి మంత్రి పదవి ఇవ్వకపోతే రాజీనామా చేస్తామని అంటున్నారు.
మరోవైపు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నెల్లూరులోని ఆయన ఇంటి వద్దకు ఆయన అభిమానులు, వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చారు. ఆయన ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొంది. స్వీట్లు, బాణసంచాను కూడా అభిమానులు తీసుకురావడం గమనార్హం.