Harshal Patel: సోదరి మరణవార్త విన్నా.. గెలుపుకోసం పోరాడి వెళ్లిన హర్షల్ పటేల్

Harshal Patels sister dies RCB pacer leaves for home after win against Mumbai Indians
  • ముంబై-ఆర్సీబీ మ్యాచ్ సందర్భంగా సోదరి  మరణించినట్టు సమాాచారం 
  • ఆట ముగిసే వరకు కొనసాగిన పటేల్
  • అనంతరం బయో బబుల్ నుంచి బయటకు
  • తదుపరి మ్యాచ్ కు తిరిగి అందుబాటులోకి 
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) బౌలర్ హర్షల్ పటేల్ జట్టు కోసం తన నిబద్ధతను చాటాడు. ముంబై ఇండియన్స్ తో శనివారం ఆర్సీబీ తలపడి విజయం సాధించడం తెలిసిందే. మ్యాచ్ సమయంలో సోదరి మరణించినట్టు హర్షల్ పటేల్ కు సమాచారం వచ్చింది. అయినా మ్యాచ్ ముగిసే వరకు ఉండి.. రెండు వికెట్లతో జట్టుకు విజయాన్ని అందించడంలో భాగమయ్యాడు.

మ్యాచ్ తర్వాత బయో బబుల్ నుంచి బయటకు వచ్చి ఇంటికి వెళ్లిపోయాడు. గత కొన్ని సీజన్ల నుంచి ఆర్సీబీకి హర్షల్ పటేల్ కీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఈ నెల 12న సీఎస్కేతో ఆర్సీబీ తలపడనుంది. ఆ మ్యాచ్ కు పటేల్ తిరిగి అందుబాటులోకి వస్తాడని ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. ఆర్సీబీ ఇప్పటి వరకు నాలుగు మ్యాచులు ఆడగా మూడింటిలో గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. 

Harshal Patel
sister
dies
RCB
Mumbai Indians
IPL

More Telugu News