Jennifer Lopez: మరోసారి ఎంగేజ్ మెంట్ చేసుకున్న హాలీవుడ్ జంట జెన్నిఫర్ లోపెజ్, బెన్ అఫ్లెక్!

Jennifer Lopez and Ben Affleck gets engaged
  • 2022లో తొలి సారి ఎంగేజ్ మెంట్
  • ఆ తర్వాత విడిపోయి వేర్వేరు వివాహాలు చేసుకున్న వైనం
  • గత ఏడాది నుంచి మళ్లీ దగ్గరైన జంట
బాలీవుడ్ జంట జెన్నిఫర్ లోపెజ్ (52), బెన్ అఫ్లెక్ (49) రెండోసారి ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. ఈ విషయాన్ని జెన్నిఫర్ లోపెజ్ తన వెబ్ సైట్ ద్వారా అధికారికంగా వెల్లడించింది. ఈ విషయాన్ని చెప్పడానికి తాను సంతోషిస్తున్నానని ఆమె తెలిపింది. 

2002లో వచ్చిన 'గిగ్లి' అనే చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు. అప్పుడు ప్రేమలో పడిన వీరు ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. అయితే, రెండేళ్లకే వీరు విడిపోయారు. ఆ తర్వాత మార్క్ ఆంటోనీని జెన్నిఫర్ లోపెజ్ పెళ్లి చేసుకోగా, జెన్నిఫర్ గార్నర్ ను బెన్ అఫ్లెక్ పెళ్లాడాడు. అనంతరం ఈ రెండు జంటలు కూడా విడాకులు తీసుకున్నాయి. మరోవైపు అలెక్స్ రోడ్రిగ్జ్ తో జెన్నిఫర్, సినీ నటి అనా డా అర్మాస్ తో బెన్ అఫ్లెక్ డేటింగ్ చేసిన చరిత్ర కూడా ఉంది. 

ఏదేమైనప్పటికీ పాత ప్రేమికులు జేలో, అఫ్లెక్ మళ్లీ దగ్గరయ్యారు. గత ఏడాది మోంటానాలో అకేషన్ సందర్భంగా వీరి మధ్య రిలేషన్ షిప్ మళ్లీ ప్రారంభమయిందనే రూమర్ ఉంది. ఆ తర్వాత మియామీ బీచ్ హౌస్ తో పాటు పలు చోట్ల ఈ జంట దర్శనమిచ్చింది. తాజాగా ఇద్దరూ రెండో సారి ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. ఈ సారైనా ఈ జంట కలకాలం కలిసుంటుందా? లేదా? అనే చర్చ జరుగుతోంది.
Jennifer Lopez
Ben Affleck
Hollywood
Engagement

More Telugu News