Hyderabad: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో నేటి సాయంత్రం నుంచి మ‌ద్యం దుకాణాలు బంద్

wine shops bundh in hyderabad
  • శ్రీరామ నవమి పండుగ సందర్భంగా నిబంధ‌న‌లు
  • నేటి సాయంత్రం 6 గంటల నుంచి మ‌ద్యం షాపులు బంద్
  • ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు తెర‌వకూడ‌ద‌న్న పోలీసులు
శ్రీరామ నవమి పండుగ సందర్భంగా హైదరాబాద్ లో మ‌ద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. నేటి సాయంత్రం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్‌లో మద్యం దుకాణాలు మూసేయాల‌ని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. 

మ‌ద్యం దుకాణాల య‌జ‌మానులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. కాగా, రేపు హిందువులు శ్రీ‌రామన‌వ‌మి పండుగ‌ను జ‌రుపుకోనున్నారు. హైద‌రాబాద్‌, నిర్మల్ జిల్లాలోని భైంసాతో పాటు ప‌లు ప్రాంతాల్లో ఎల్లుండి శోభాయాత్ర నిర్వ‌హిస్తారు.  

Hyderabad
wine
sri rama navami

More Telugu News