Bihar: ఆ బ్రిడ్జి కేసు లాగానే.. సీఎం జగన్ కూడా పిచ్చి, అరాచకంతో భవిష్యత్ ను లాగేసుకుంటున్నారు: లోకేశ్

Nara Lokesh Compares AP Govt Acts With Bihar Steel Bridge Theft
  • ఏపీ సీఎంపై టీడీపీ జనరల్ సెక్రటరీ మండిపాటు
  • బీహార్ లో స్టీల్ బ్రిడ్జి చోరీ ఘటనను ప్రస్తావించిన లోకేశ్
  • ఏపీని గాడిలో పెట్టాలంటే ఎంతకాలం పడుతుందోనని కామెంట్
ఏపీ ప్రభుత్వంపై టీడీపీ జనరల్ సెక్రటరీ, ఎమ్మెల్సీ నారా లోకేశ్ మండిపడ్డారు. బీహార్ లో 500 టన్నుల స్టీల్ బ్రిడ్జిని దోచేసిన ఘటనతో ఏపీ ప్రభుత్వాన్ని పోల్చారు. బీహార్ లోని ఆరా సోనె కెనాల్ మీద బీహార్ ప్రభుత్వం నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని దొంగలు మొత్తం విప్పేసి దోచుకెళ్లిపోయారు. దానికి సంబంధించిన వార్తను పేపర్ కటింగ్ తో పోస్ట్ చేసి, సీఎం జగన్ పై లోకేశ్ విరుచుకుపడ్డారు. 

ఆ స్టీల్ బ్రిడ్జి దొంగతనం లాగానే సీఎం జగన్ కూడా తన పిచ్చి, అవినీతి, అరాచకాలు, అసమర్థతతో రాబోయే తరాల భవిష్యత్ ను దొంగిలించేస్తున్నారని మండిపడ్డారు. ఎంతో వెనుకబడిపోయిన ఆంధ్రప్రదేశ్ ను మళ్లీ గాడిలో పెట్టాలంటే ఇంకెంత కాలం పడుతుందో ఊహించుకోవడం కష్టమని ఆయన విమర్శలు గుప్పించారు.
Bihar
Andhra Pradesh
Telugudesam
Nara Lokesh
YSRCP
YS Jagan

More Telugu News