Chi ranjeevi: చిరూ మూవీలో పూరి గెస్టు రోల్!

Puri in God Father Movie
  • 'గాడ్ ఫాదర్'గా చిరంజీవి
  • కీలకమైన పాత్రలో సల్మాన్ 
  • ముఖ్యమైన పాత్రలో నయన్
  • జర్నలిస్టుగా నటించనున్న పూరి  

చిరంజీవి 150వ సినిమాను రూపొందించడానికి పోటీపడిన దర్శకులలో పూరి ఒకరు. మాస్ మసాలా యాక్షన్ తో కూడిన కథను 'ఆటోజానీ' టైటిల్ తో ఆయన చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన కుదరలేదు. ఇప్పటికీ ఆయన చిరంజీవితో సినిమా చేసే ఛాన్స్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు. 

అయితే చిరంజీవి సినిమాకి డైరెక్షన్ చేసే సంగతి అటుంచితే, ఆయన సినిమాలో యాక్ట్ చేయడానికి పూరి రెడీ అవుతున్నారనే ఒక టాక్ బలంగా వినిపిస్తోంది. చిరంజీవి కథానాయకుడిగా మోహన్ రాజా దర్శకత్వంలో 'గాడ్ ఫాదర్' సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఒక జర్నలిస్టు పాత్రలో పూరి కనిపించనున్నాడని అంటున్నారు. 

 రాజకీయాలకి సంబంధించిన నేపథ్యంలో నిర్మితమవుతున్న ఈ సినిమాలో నయనతార ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. అలాగే ఈ సినిమాలో ఒక ముఖ్యమైన  పాత్రను సల్మాన్ పోషించాడు. ఇటీవలే బాంబే షెడ్యూల్ పూర్తయింది. మలయాళ 'లూసిఫర్'కి రీమేక్ గా రూపొందుతున్న ఈ  సినిమా, ఆ స్థాయిలోనే ఇక్కడ కూడా హిట్ కొడుతుందని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News