PV Sindhu: నల్లేరుపై నడకే.. అలవోకగా గెలిచేసిన సింధు

  • కొరియా ఓపెన్ సెమీస్ లోకి సింధు 
  • థాయ్ లాండ్ ప్లేయర్ ను మట్టికరిపించిన వైనం  
  • 43 నిమిషాల్లోనే మ్యాచ్ లో గెలుపు
  • 21–10, 21–16తో వరుస సెట్లలో విజయం
Sindhu Wins Quarter Final enters Korean Open Semis

బ్యాడ్మింటన్ కొరియా ఓపెన్ లో పి.వి. సింధుకు క్వార్టర్ ఫైనల్ లో విజయం నల్లేరుపై నడకే అయింది. ప్రత్యర్థి ఏడో సీడ్ థాయ్ లాండ్ ప్లేయర్ బుశానన్ ఓంగ్బామ్రుంగ్ఫాన్ ను మూడో సీడ్ సింధు అలవోకగా ఓడించి దర్జాగా సెమీ ఫైనల్ లోకి అడుగుపెట్టింది. 

ఇవాళ పామా స్టేడియంలో జరిగిన ‘కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్స్ 2022’ మ్యాచ్ లో తొలుత సింధు వెనుకబడింది. తొలి సెట్లో 2–5తో వెనుకంజలో ఉన్న సింధు.. ఆ తర్వాత ఒక్కసారిగా రాకెట్ ఝళిపించింది. ప్రత్యర్థిపై ఒకేసారి నాలుగు పాయింట్లు సాధించి 6–5 లీడ్ లోకి వెళ్లిపోయింది. 

అక్కడి నుంచి ఏ దశలోనే బుశానన్ కు సింధు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. 21–10 తేడాతో తొలి సెట్ ను కైవసం చేసుకుంది. అనంతరం రెండో సెట్ నూ అదే జోరుతో కొనసాగించి, 8–2 లీడ్ సాధించింది. ఈ క్రమంలో బుశానన్ కొంత పోరాడింది. అయినా కూడా సింధు గట్టి పోటీనిచ్చి 21–16తో సెట్ ను, మ్యాచ్ ను గెలిచింది. 43 నిమిషాల్లోనే సింధు మ్యాచ్ ను గెలవడం విశేషం. సెమీస్ లో సౌత్ కొరియాకు చెందిన రెండో సీడ్ ప్లేయర్ సేయంగ్ తో లేదా జపాన్ కు చెందిన సాయేనా కవాకామీతోనైనా పోటీ పడుతుంది.

More Telugu News