Vladimir Putin: పుతిన్ కుమార్తెలు ఉన్నత విద్యాధికులే.. వారి గురించి మరిన్ని వివరాలు ఇవిగో!

  • పుతిన్ మొదటి భార్యకు ఇద్దరు కుమార్తెలు
  • ఒకరు డాక్టర్, మరొకరు టెక్ నిపుణురాలు
  • ప్రస్తుతానికి రష్యాలో ఉన్నట్టు సమాచారం
  • వీరి వివరాలు ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు 
Vladimir Putins daughters sanctioned by US All about them

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కుమార్తెలపై అమెరికా ఆంక్షలు విధించింది. పుతిన్ కు మొదటి భార్య లిదుమినా పుతీనాతో ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారి పేర్లు మారియా వ్లాదిమిరోవ్, కేథరీనా వ్లాదిమిరోవ్ టికోనోవా. వీరిద్దరూ 30 సంవత్సరాలకు పైగా వయసులో ఉన్నారు.

పెద్ద కుమార్తె మారియా వ్లాదిమిరోవ్ (36) పిడియాట్రిక్ ఎండ్రోకైనాలజిస్ట్. సెయింట్ పీటర్స్ బర్గ్ యూనివర్సిటీలో బయాలజీ, మాస్కో స్టేట్ యూనివర్సిటీలో మెడిసిన్ చదివారు. మారియా వ్లాదిమిరోవ్ జెనెటిక్స్ రీసెర్చ్ వైపు పనిచేస్తున్నారు. వైద్య సంస్థ నోమెన్కో సహ యజమాని. చిన్న పిల్లలకు వచ్చే అరుదైన వ్యాధుల వైద్య నిపుణురాలు. డచ్ వ్యాపారి జూస్ట్ ఫాస్సెన్ ను వివాహం చేసుకున్నారు.  

ఇక రెండో కుమార్తె కేథరీనా వ్లాదిమిరోవ్ (35) టెక్ ఎగ్జిక్యూటివ్. ఆక్రోబాటిక్ డ్యాన్సర్ కూడా. ఆమె నెట్ వర్త్ 2020 నాటికి 2 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. 2020లో మాస్కో స్టేట్ యూనివర్సిటీలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఇనిస్టిట్యూట్ కు అధిపతిగా ఆమెను నియమించారు. పుతిన్ స్నేహితుడి కుమారుడు కిరిల్ షమలోవ్ ను కేథరీనా వివాహం చేసుకుంది. బ్యాంక్ రష్యాలో వాటాదారు ఆయన. 

ప్రస్తుతం పుతిన్ కుమార్తెలు రష్యాలోనే ఉన్నప్పటికీ.. కచ్చితంగా ఎక్కడ ఉన్నారనే వివరాలు బయటకు తెలియవు. వారి భద్రత దృష్ట్యా ఎంతో గోప్యత పాటిస్తారు. పుతిన్ కు రెండో భార్య అలీనా కబేవా ద్వారా మరో నలుగురు సంతానం (ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు) ఉన్నట్టు సమాచారం. అమెరికా ఆంక్షల నేపథ్యంలో రష్యాకు వెలుపల వారి కుమార్తెలకు సంబంధించి బ్యాంకు ఖాతాలు, ఆస్తుల స్తంభనకు చర్యలు తీసుకుంటున్నారు. 

More Telugu News