Mahesh Babu: ఒకే రోజు 30 మంది చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపిన టాలీవుడ్ నటుడు మహేశ్‌బాబు

Tollywood Actor Maheshbabu lit lights in 30 children lives
  • 30 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్
  • అభిమానులతో పంచుకున్న నమ్రత
  • ఏపీ గవర్నర్, ఆంధ్రా ఆసుపత్రికి నమ్రత కృతజ్ఞతలు
  • మహేశ్‌బాబుపై కురుస్తున్న ప్రశంసల వర్షం
టాలీవుడ్ ప్రముఖ నటుడు మహేశ్‌బాబు ఒకే రోజు 30 మంది చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపారు. నిన్న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చిన్నారులందరికీ గుండె ఆపరేషన్లు చేయించారు. మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ఆంధ్రా ఆసుపత్రి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. 

ఈ సందర్భంగా మహేశ్ ఉదారతపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మహేశ్ బాబు గ్రేట్ అని కొనియాడుతున్నారు. ఎంబీ ఫౌండేషన్ పేరుతో మహేశ్‌బాబు ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎంతోమంది చిన్నారులకు ఈ ఫౌండేషన్ ద్వారా ఆపరేషన్లు చేయిస్తూ అండగా నిలుస్తున్నారు. కాగా, మహేశ్‌బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సర్కారువారి పాట’ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
Mahesh Babu
Tollywood
Namrata Shirodkar
Heart Operations
Andhra Pradesh
Andhra Hospital

More Telugu News