IPL: సెహ్వాగ్ పై రోహిత్ ఫ్యాన్స్ గరంగరం.. చల్లబడాలంటూ సెహ్వాగ్ కౌంటర్

Sehwag Clarified on His Tweet Over Cummins Batting
  • ప్యాట్ కమిన్స్ ఇన్నింగ్స్ పై ప్రశంసలు
  • నోటికాడి ‘వడాపావ్’ లాగేసుకున్నాడంటూ ట్వీట్
  • మండిపడిన రోహిత్ అభిమానులు
  • క్లారిటీ ఇస్తూ మరో ట్వీట్ చేసిన సెహ్వాగ్
టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ పై రోహిత్ శర్మ అభిమానులు గరంగరం అవుతున్నారు. అందుకు తగ్గట్టు సెహ్వాగ్ కూడా వారికి కౌంటర్ ఇచ్చాడు. సెహ్వాగ్ చేసిన కామెంట్లే ఈ మొత్తం వివాదానికి కారణమైంది. ఇంతకీ సెహ్వాగ్ ఏమన్నాడంటే...

నిన్న ముంబైతో జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాటర్ ప్యాట్ కమిన్స్ వీర బాదుడు గురించి తెలిసిందే. 15 బంతుల్లోనే 56 పరుగులు చేసి ముంబైకి పీడ కల మిగిల్చాడు. దీనిపైనే సెహ్వాగ్ కామెంట్ చేశాడు. 

‘‘నోటికాడి కూడును లాగేసుకున్నాడు.. సారీసారీ వడాపావ్ లాగేసుకున్నాడు. వీరబాదుడుతో ప్యాట్ కమిన్స్ 15 బంతుల్లోనే 56 పరుగులు చేశాడు’’ అంటూ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ పై వెంటనే రోహిత్ ఫ్యాన్స్ స్పందించారు. సెహ్వాగ్ పై విమర్శలు గుప్పించారు. 

దీంతో సెహ్వాగ్ తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చాడు. రోహిత్ కు అందరికన్నా తానే పెద్ద అభిమానినని, రోహిత్ బ్యాటింగ్ చాలా ఇష్టమని మరో ట్వీట్ చేశాడు. తాను కేవలం ముంబైకి సూచికగానే వడాపావ్ అన్నానని, రోహిత్ ను అనలేదని, హిట్ మ్యాన్ అభిమానులంతా కాస్తంత చల్లబడాలని ట్వీట్ చేశాడు.
IPL
Virender Sehwag
Cricket
Rohit Sharma
Pat Cummins
Mumbai Indians
Kolkata Knight Riders

More Telugu News