Pavan Kalyan: 'వీరమల్లు' కోసం మళ్లీ ప్రాక్టీస్ మొదలెట్టిన పవన్!

  • పవన్, క్రిష్ కాంబోలో 'హరి హర వీరమల్లు'  
  • 'పంచమి' పాత్రలో నిధి అగర్వాల్
  • సంగీత దర్శకుడిగా కీరవాణి
  • కీలకమైన పాత్రలో అర్జున్ రాంపాల్
Hari Hara Veera Mallu movie update

పవన్ కల్యాణ్ - క్రిష్ కాంబినేషన్లో ' హరి హర వీరమల్లు' సినిమా రూపొందుతోంది. భారీ బడ్జెట్ తో ఎ.ఎం.రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముందుగా 'భీమ్లా నాయక్'ను పూర్తి చేద్దామని పవన్ అనుకోవడం వలన, ఈ సినిమా షూటింగు విషయంలో జాప్యం జరిగింది. ఇక ఇప్పుడు ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగుకి సన్నాహాలు పూర్తయ్యాయి.

ఈ కథ మొగల్ చక్రవర్తుల కాలంలో నడుస్తుంది. ఆ కాలంలో యుద్ధ విద్యలు తెలిసిన గజదొంగ పాత్రలో పవన్ కల్యాణ్ కనిపించనున్నారు. మార్షల్ ఆర్ట్స్ లో ప్రవేశమున్న పవన్, మరింత ఆసక్తితో ఆ యుద్ధ విద్యలను ప్రాక్టీస్ చేసి మరీ రంగంలోకి దిగుతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

'వీరమల్లు'గా పవన్ చేస్తున్న ఈ సినిమాలో, ఆయన ప్రియురాలైన 'పంచమి' పాత్రలో నిధి అగర్వాల్ కనిపించనుంది. కీరవాణి స్వరపరిచిన పాటలు .. ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనున్నాయి. అర్జున్ రాంపాల్.. జాక్వెలిన్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.

More Telugu News