కొణిదెల నిహారిక పబ్ కు వెళ్లడంపై బిగ్ బాస్ కంటెస్టెంట్ తమన్నా స్పందన!

07-04-2022 Thu 09:22
  • ఎవరో చేసిన తప్పుకు పబ్ కు వెళ్లిన వారందరినీ దొంగల్లా చూస్తున్నారన్నా తమన్నా 
  • నిహారికను టార్గెట్ చేస్తూ బురద చల్లుతున్నారని విమర్శ 
  • నిహారిక డ్రగ్స్ తీసుకున్నట్టు పోలీసులు చెప్పలేదని వ్యాఖ్య  
Bigboss contestant Tamannaah response on Niharika pub issue
హైదరాబాదులోని రాడిసన్ హోటల్ పుడింగ్ అండ్ మింక్ పబ్ లో వెలుగుచూసిన డ్రగ్స్ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. పోలీసుల దాడుల్లో పట్టుబడిన వారిలో ప్రముఖుల పిల్లలు ఉండటం కలకలం రేపింది. ప్రముఖ సినీ నటుడు నాగబాబు కుమార్తె నిహారిక కూడా ఆ అర్ధరాత్రి సమయంలో పోలీస్ స్టేషన్ కు తరలించిన వారిలో ఉన్నారు. పోలీస్ స్టేషన్ లో ఆమె ఫోన్ లో మాట్లాడుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. 

ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీ  విమర్శలను  ఎదుర్కొంది. నాగబాబు ఓ వీడియో ముఖంగా తన కుమార్తె తప్పేమీ లేదని పోలీసులు చెప్పినట్టు వెల్లడించారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి కొన్ని అరెస్టులు కూడా జరిగాయి. 

ఇంకోవైపు, నిహారిక ఉదంతంపై బిగ్ బాస్ కంటెస్టెంట్, ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి స్పందించారు. ఎవరో చేసిన తప్పుకు... పబ్ కు వెళ్లిన వారందరినీ దొంగల్లా చూడటం సరికాదని అన్నారు. పబ్ కు వెళ్లడమే తప్పు అనే విధంగా నిహారికపై బురద చల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్రెండ్ బర్త్ డే సెలబ్రేషన్ కోసమే నిహారిక పబ్ కు వెళ్లిందని చెప్పారు. 

నిహారికను టార్గెట్ చేస్తూ మీడియా, సోషల్ మీడియాలో కథనాలు వస్తుండటం దారుణమని అన్నారు. నిహారిక డ్రగ్స్ తీసుకున్నట్టు పోలీసులు చెప్పలేదని గుర్తు చేశారు. మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం బాధాకరమని... ట్రోల్ చేసిన వారిని అడ్డుకుంటామని తెలిపారు. నిహారిక ఫ్యామిలీని టార్గెట్ చేయడాన్ని మానుకోవాలని కోరారు.
బిగ్ బాస్ కంటెస్టెంట్ తమన్నా