Pope: ధ్వంసమైన ఉక్రెయిన్ జెండాను ముద్దాడిన పోప్ ఫ్రాన్సిస్

Pope kisses Ukraine flag
  • వాటికన్ సిటీకి వచ్చిన ఉక్రెయిన్ చిన్నారులను ఆహ్వానించిన పోప్
  • ఉక్రెయిన్ ప్రజల కోసం ప్రార్థనలు చేయాలని పిలుపు
  • యుద్ధాన్ని వెంటనే ముగించాలని హితవు
ఉక్రెయిన్ పై రష్యా కొనసాగిస్తున్న దాడులు ప్రపంచ దేశాలను కలవరపరుస్తున్నాయి. సామాన్య పౌరులను సైతం రష్యా సైనికులు ఊచకోత కోస్తున్నారు. బుచా పట్టణంలో దాదాపు 320 మంది పౌరులను చంపినట్టు ఆ నగర మేయర్ తెలిపారు. ప్రజలను రష్యా సైనికులు చంపడాన్ని తాను కళ్లారా చూశానని ఆయన చెప్పారు. 

మరోవైపు బుచా నగరంలో రష్యా దాడుల్లో ధ్వంసమైన ఉక్రెయిన్ జెండాను పోప్ ఫ్రాన్సిన్ ముద్దాడారు. వాటికన్ సిటీకి వచ్చిన ఆరుగురు చిన్నారులను ఆయన ఆహ్వానించారు. వారు తీసుకొచ్చిన జెండాను తీసుకుని ముద్దాడారు. యుద్ధాన్ని వెంటనే ముగించాలని మరోసారి హితవు పలికారు. ఉక్రెయిన్ ప్రజల కోసం ప్రార్థనలు చేయాలని పిలుపునిచ్చారు. తన వద్దకు వచ్చిన చిన్నారులకు ఒక పెద్ద చాక్లెట్, ఈస్టర్ గుడ్డును ఇచ్చారు.
Pope
Ukraine
Flag
Russia

More Telugu News