KTR: కంటోన్మెంట్ అధికారుల‌తో కేటీఆర్ కీల‌క భేటీ

Secunderabad Cantonment Board officials meetsd minister ktr
  • గేట్ల మూసివేత‌పై కీల‌క చ‌ర్చ‌
  • జీహెచ్ఎంసీ అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుంటామ‌న్న ఆర్మీ
  • ఇత‌ర‌త్రా పెండింగ్ అంశాల‌పైనా చ‌ర్చ‌
సికింద్రాబాద్ పరిధిలో భార‌త సైన్యం అధీనంలోని కంటోన్మెంట్‌, తెలంగాణ ప్ర‌భుత్వం మ‌ధ్య సుదీర్ఘంగా సాగుతున్న వైరానికి తెరప‌డే దిశ‌గా మంగ‌ళ‌వారం కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. కంటోన్మెంట్‌కు చెందిన అధికారుల బృందం తెలంగాణ మునిసిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్‌తో భేటీ అయింది. 

ఈ సంద‌ర్భంగా కంటోన్మెంట్ ప‌రిధిలోని గేట్ల మూసివేత, ఇత‌ర‌త్రా పెండింగ్‌లోని అంశాల‌పై కీల‌క చ‌ర్చ జ‌రిగింది. భ‌విష్య‌త్తులో స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా ఉండేలా తెలంగాణ ప్ర‌భుత్వం, జీహెచ్ఎంసీ అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుంటామ‌ని ఈ సంద‌ర్భంగా ఆర్మీ అధికారులు కేటీఆర్‌కు తెలిపారు.
KTR
TRS
Secunderabad Cantonment Board
Indian Army

More Telugu News