RCB: ఐపీఎల్: రాజస్థాన్ పై కీలకమైన టాస్ గెలిచిన బెంగళూరు

RCB won the crucial toss against Rajasthan Royals
  • ముంబయి వాంఖెడే స్టేడియంలో మ్యాచ్
  • బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు
  • మార్పుల్లేకుండా బరిలో దిగుతున్న బెంగళూరు, రాజస్థాన్
  • పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రాజస్థాన్

ఐపీఎల్ లో నేడు రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ముంబయిలోని వాంఖెడే స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ లో బెంగళూరు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ టోర్నీలో రాజస్థాన్ జట్టు ఇప్పటివరకు రెండు మ్యాచ్ లు ఆడి, రెండింటా విజయం సాధించింది. తద్వారా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 

అదే సమయంలో బెంగళూరు జట్టు రెండు మ్యాచ్ లు ఆడి, ఒక దాంట్లో గెలిచింది. ఇవాళ్టి మ్యాచ్ కోసం ఇరు జట్లలోనూ ఎలాంటి మార్పులు లేవు.
RCB
Toss
Rajasthan Royals
IPL

More Telugu News