Hindu inheritence law: హిందూ వారసత్వ చట్టంలో లింగ వివక్షపై పిటిషన్.. కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరిన సుప్రీంకోర్టు

Supreme Court asks centres opinion on Hindu Inheritence Law
  • హిందూ వారసత్వ చట్టం లింగ సమానత్వానికి వ్యతిరేకంగా ఉందంటూ పిటిషన్
  • చట్టంలో అసమానతలు ఉన్నాయన్న పిటిషనర్
  • వంశపారంపర్యంగా సమాన హక్కులు ఉండాలని కోర్టును కోరిన పిటిషనర్
హిందూ వారసత్వ చట్టానికి సంబంధించిన చట్టం రాజ్యాంగానికి, లింగ సమానత్వానికి వ్యతిరేకంగా ఉందంటూ దాఖలైన పిటిషన్ ను ఈరోజు సుప్రీంకోర్టు విచారించింది. దీనికి సంబంధించి అభిప్రాయాన్ని వెల్లడించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నాలుగు వారాల్లోగా అభిప్రాయాన్ని తెలపాలని సమయాన్ని నిర్దేశించింది. 

ఈ పిటిషన్ ను కమల్ అనంత్ ఖోప్కార్ అనే వ్యక్తి దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ త్రివేదీలతో కూడిన ధర్మాసనం విచారించింది. సమాజం లైంగిక సమానత్వం వైపుగా అడుగులు వేస్తున్న ఈ తరుణంలో కూడా అసమానతలు ఉన్నాయని... హిందూ మహిళల తరపున ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టును పిటిషనర్ కోరారు. పురుషులతో పాటు మహిళలకు కూడా వంశపారంపర్యంగా సమాన హక్కులు ఉండాలని చెప్పారు.
Hindu inheritence law
Supreme Court
Gender Bias
Centre

More Telugu News