Corona Case: ఏపీలో ఒకే ఒక్క కరోనా కేసు... పూర్తి వివరాలు ఇవిగో!
ఏపీలో గత రెండ్రోజులుగా కరోనా కేసుల బులెటిన్ విడుదల చేయలేదు. నేడు తాజా బులెటిన్ విడుదల చేయగా, ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. గడచిన 24 గంటల్లో 2,726 కరోనా పరీక్షలు నిర్వహించగా, ఒకే ఒక్క పాజిటివ్ కేసు నమోదైంది. ఆ కేసు కూడా తూర్పు గోదావరి జిల్లాలో గుర్తించారు. మిగతా జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.
అదే సమయంలో 32 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. ఏపీలో ఇప్పటివరకు 23,19,578 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 23,04,729 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 119 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 14,730 మంది మరణించారు.
.